ప్రైవేటు విద్యాస్థంస్థల ఉద్యోగులకు 5లక్షల హెల్త్ ఇన్సూరెన్స్

Update: 2018-11-29 06:45 GMT

తెలంగాణలో విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆయన ఇవాళ ఉదయం ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాము అధికారంలోకి రాగానే నిర్ణీత సమయంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాస్థంస్థల ఉద్యోగులకు 5లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

Similar News