ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ను ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్..

Update: 2017-12-27 11:52 GMT

ప్రపంచంలోనే తొలిసారిగా ఫైబర్‌గ్రిడ్‌తో ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, టెలివిజన్, ఫోన్ సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫైబర్ గ్రిడ్‌ను ప్రారంభించారు. నెలకు 149 రూపాయలతో మూడు రకాల సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేసింది. రోజంతా వైఫై, 15 ఎంబీపీఎస్ ఇంటర్నెట్, 250 చానల్స్ అందించనున్నారు. విద్యుత్ స్తంభాలను ఉపయోగించుకుని రూ.400 కోట్లతో పథకాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
 

Similar News