ఆ పార్టీలో చేరుతున్న ప్రశాంత్ కిషోర్.. వైసీపీకి ఇక డౌటే..

Update: 2018-09-16 06:27 GMT

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని బీహార్ నుంచి ఆరంభించనున్నాడు.  ఆదివారం జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రశాంత్ కిశోర్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నాడు 'బిహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తేజభరితంగా ఉంది' అని  ట్వీట్ చేశాడు. 
 
ప్రశాంత్ కిశోర్ 2014 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తరువాత బీహార్ లో లాలూ, నితీష్ కూటమికి పనిచేశారు. అయితే ఈ రెండు ఆయనకు సంతృప్తినిచ్చాయి. ఆ తరువాత ఉత్తరప్రదేశ్ అసీంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీతో కలిసి వ్యూహాలను రచించాడు. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ 350 పైచిలుకు సీట్లలో గెలుపొందింది. రెండు నెలల కిందట వరకు వైసీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేశారు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న  ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేయడం దాదాపు కష్టమేనని భావించాలి. 

Similar News