నాగాలాండ్, మేఘాలయల్లో ప్రశాంతంగా పోలింగ్

Update: 2018-02-27 05:04 GMT

ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున స్థానాలున్నాయి. రెండు చోట్లా ఒక్కో స్థానంలో ఎన్నిక నిలిచిపోవడంతో 59 స్థానాల్లో పోలింగ్‌ ప్రక్రియ మొదలైంది. మేఘాలయలోని విలియమ్‌నగర్‌లో ఎన్‌సీపీ అభ్యర్థి హత్యతో ఎన్నిక వాయిదా పడగా.. నాగాలాండ్‌లోని ఉత్తర అంగామీ స్థానంలో ఎన్నిక ఏకగ్రీవమైంది. అక్కడ ఎన్‌డీపీపీ అభ్యర్థి నిపియు రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీతో బీజేపీ జతకట్టి 47 స్థానాల్లో బరిలో ఉండగా, కాంగ్రెస్‌ 59 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీతో పొత్తు పెట్టుకున్న కమలదళం 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. మార్చి 3న త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Similar News