జగన్ పై దాడి.. మరో యువకుడు అరెస్ట్..

Update: 2018-10-28 02:34 GMT

విశాఖ ఎయిర్పోర్టులో కత్తి దాడిలో గాయపడ్డ జగన్‌ క్రమంగా కోలుకుంటున్నారు. జగన్‌కు డాక్టర్లు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. బ్లడ్‌ శాంపిల్స్‌ రిపోర్ట్స్‌లో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. పాదయాత్రకు వెళితే అభివాదాలు చేయడం వల్ల కండరాలు నొప్పికి గురవుతాయని సూచించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు పోలీసులు జగన్‌పై దాడి కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడు శ్రీనివాస్‌కు లెటర్‌ రాయడంలో సహకరించిన సోదరి విజయను అదుపులోకి తీసుకున్నారు. మరో స్నేహితుడు రేవతిపతి కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఫ్లెక్సీ మార్ఫింగ్‌ ఉదంతంలో తానేపల్లికి చెందిన గడ్డి చైతన్య అనే యువకుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడు శ్రీనివాస్‌ ఏడాదిలో 9 ఫోన్లు మార్చడంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అతను ఇన్ని ఫోన్‌లు ఎందుకు మార్చాడు.. అంత డబ్బు ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారనేది విచారణలో బయటపడుతోందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

Similar News