వరదలతో ప్రజలు అల్లాడుతుంటే కారుకూతలు కూశాడు.. ఇంతలో..

Update: 2018-08-20 12:26 GMT

 కేరళలో ఓ వైపు వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే.. ఓ ఉద్యోగి కారుకూతలు కూసి తగిన శాస్తి చేయించుకున్నాడు. కేరళకు చెందిన రాహుల్‌ ఒమన్‌ లులు గ్రూప్‌ కంపెనీలో  కేషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. పన్నెండు రోజులుగా వరద బీభత్సంతో కేరళ ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతుంటే అతను మాత్రం హేళన చేశాడు. వరద బాధితులకు వలంటీర్లు సహాయం చేస్తుండడంపై రెండు రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఆయనో పోస్ట్‌ పెట్టాడు.  సహాయక శిబిరాల్లో ఎవరైనా సానిటరీ నేప్‌కిన్స్ కోసం  అడిగితే, తాను మాత్రం వాటికి బదులుగా కండోమ్స్ అడుగుతానంటూ పోస్ట్ షేర్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో పలువురికి ఒళ్ళు మండి చివాట్లు పెట్టారు. సొంత రాష్ట్రం అల్లో అని అల్లాడుతుంటే నువ్వు మాత్రం హేళన చేస్తున్నామంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో అది కాస్త అతను పని చేసే కంపెనీ పెద్దలకు తెలిసింది. దీంతో రాహుల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. మద్యం మత్తులో అలా మాట్లాడాను తప్పైపోయింది, క్షమించండంటూ వేడుకున్నా.. కంపెనీ ఎంతమాత్రం ఉపేక్షించలేదు. కాగా కేరళ వరద బాధితులకు లులు గ్రూపు ఛైర్మన్ యూసుఫ్ అలీ  5కోట్ల రూపాయలును విరాళమిచ్చారు.

Similar News