నేటి నుంచి ఓటర్ల నమోదు.. ఓటు ఉందొ లేదో చూసుకోండిలా..

Update: 2018-12-26 04:49 GMT

వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు కార్యక్రం చేపడుతోంది. బుధవారం నుంచి జనవరి 25 వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వయోజనులందరు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది. అలాగే ఓటుహక్కు లేనివారు, జాబితాలో పేర్లు గల్లంతైనవారు, మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. ఈ నెల 26 నుంచి జనవరి 25 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది. కాగా నూతన దరఖాస్తులు, అభ్యంతరాలను ఫిబ్రవరి 11వ తేదీలోగా పరిష్కరించి, ఫిబ్రవరి 22న తుది జాబితా విడుదల చేస్తామని తెలిపింది. ఇదిలావుంటే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి http://ceotelangana.nic.in/ వెబ్‌సైట్‌ లేదా 9223166166/51969 నంబర్లకు ‘ TSVOTEVOTERID NO’ నమూనాలో ఎస్సెమ్మెస్‌ పంపడం ద్వారా కూడా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

Similar News