ఉత్తరాదిన రెడ్‌అలర్ట్‌...పంజాబ్‌, హర్యానాలోనూ భారీ వర్షాలు

Update: 2018-09-24 12:17 GMT

మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు తడిసిముద్దయ్యాయి. భారీ వరదలకు హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉదృతంగా ఉన్న కులు జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లోనూ హై అలర్ట్‌ ప్రకటించారు. కాంగ్రా జిలాలలోని నహాద్‌ ఖాడ్‌ గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని ఓ వ్యక్తి మరణించాడు.

హిమాచల్‌ప్రదేశ్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో.. కుండపోతలా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపెడుతున్నారు. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో.. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, హిమాచల్‌ప్రదేశ్‌లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.  

హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఉత్తరాధిన పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా పంజాబ్‌, హర్యానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్‌లో వాతావరణ విభాగం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. పంజాబ్‌లో కుండపోతలా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.  

Similar News