‘రాజ్యసభ డిప్యూటీ’ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం

Update: 2018-08-09 06:39 GMT

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ ఎన్నికలో ఎన్‌డీఏ అభ్యర్ధి హరివంశ్‌ నారాయణ్‌  ఘన విజయం సాధించారు. జేడీయూకు చెందిన హరివంశ్‌ నారాయణ్‌  ఎన్‌డీఏ తరపున బరిలోకి దిగి మిత్ర పక్షాల సహకారంతో 125 ఓట్లు సాధించారు. ఇక విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్‌ 105 ఓట్లు మాత్రమే సాధించి పరాజయం పాలయ్యారు. ఎన్‌డీఏ అభ్యర్ధి హరివంశ్‌ నారాయణ్‌‌కు టీఆర్‌ఎస్‌,, బీజేడీ అభ్యర్ధులు మద్ధతు తెలపగా ..  కాంగ్రెస్ అభ్యర్ధికి తెలుగు దేశం పార్టీ సభ్యులు మద్ధతిచ్చారు. ఇక సభకు హాజరైన వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యులు ఓటింగ్‌‌లో మాత్రం పాల్గొనలేదు.  

డిప్యూటి ఛైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్  నారాయణ్‌కు విపక్షనేత గులాంనబి అజాద్ అభినందనలు తెలియజేశారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఎన్నికలు ఓ భాగమైనందున పోటీ చేశామన్న ఆయన సభను సమర్ధవంతంగా నిర్వహించే సత్తా హరివంశ్‌కు ఉందన్నారు. జర్నలిస్టుగా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న హరివంశ్‌ సభను హుందాగా వ్యవహరించి నడుపుతారన్నారు. 

Similar News