తెలంగాణకు నరేంద్రమోడీ ఎంతో చేశారు: కేంద్ర స్మృతి ఇరానీ

Update: 2018-12-04 11:54 GMT

నరేంద్ర మోడీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలకు ప్రతి గ్రామానికి80 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా  డిచ్‌పల్లిలో మార్పు కోసం బీజేపీ బహిరంగ సభలో స్మృతి ఇరానీ పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల కొరకు ఉపాధి హామీకి వందరోజుల పని కల్పించి 55 వేల కోట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం సమకూర్చిందని తెలియజేశారు. నరేంద్ర మోడీ పేద మహిళల కొరకు ఉచిత గ్యాస్ కలెక్షన్లు 20 లక్షల మందికి లబ్ధి చేకూరింది గ్రామీణ ప్రాంత ప్రజల కొరకు సొంత ఇల్లు కొరకు రెండు లక్షల మూడు వేల  ఇండ్లు  మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. ప్రతి రైతు చేనుకి సాగునీరు కొరకు 11 ప్రాజెక్టులకు 11 వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు. నాలుగున్నర సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం వారి లాభం కొరకె పని చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 వేల కోట్లతో ఏమ్స్ హాస్పిటల్ మంజూరు చేస్తే  టీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం చూపలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం లోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ప్రతి రైతు చేనులో ఉచిత బోర్వెల్ . రైతుకు ఆరోగ్య భీమా కింద 5 లక్షల పథకం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలలో యువకులకు ఉద్యోగం ఉపాధి కొరకు రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.
 

Similar News