రేపు తెలంగాణలో మోడీ పర్యటన

Update: 2018-11-26 11:49 GMT

తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రధాని మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు నిజామాబాద్‌ చేరుకోనున్న మోడీ అక్కడ జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన కమలనాథులు భారీగా జనసమీకరణకు ప్రయత్నిస్తున్నారు. సమయం మించిపోతోంది. త్వరపడండి, అంటూ తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి నేతలు కోరుతుంటే జాతీయ నేతలు టూర్ షెడ్యూల్ వేసుకొని వాలిపోతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం మరింత స్పీడు పెంచేందుకు జాతీయ నాయకులను ప్రచారంలోకి దింపుతోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొలివిడత ప్రచారాన్నినిర్వహించగా ప్రధాని మోడీ కూడా తెలంగాణలో జరగనున్న జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. 

ప్రధాని మోడీ మొదటి విడతలో రేపు నిజామాబాద్, మహబూబ్‌ నగర్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న మోడీ ప్రత్యేక హెలికాఫ్టర్ లో 11 గంటల 50 నిమిషాలకు నిజామాబాద్‌ చేరుకోనున్నారు. అక్కడ జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మహబూబ్ నగర్ బహిరంగ సభకు హాజరవుతారు. తర్వాత, హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని సభలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన కమలనాథులు జిల్లాల నుంచి భారీగా జనసమీకరణకు ప్రయత్నిస్తున్నారు. ఈ పర్యటన అనంతరం, డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. అమిత్ షా కూడా మరో రెండు సార్లు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించున్నారు. ఈనెల 28న, డిసెంబర్ 2న జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఎన్నికలు సమీపించడంతో మోడీ, అమిత్ షాతో పాటు పలువురు జాతీయ నేతలలో ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. 

Similar News