బ్రెయిన్ స్ట్రోక్‌తో ఐసీయూలో మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ

Update: 2017-09-20 14:43 GMT

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎన్డీ తివారీ బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. ఆయనను ఈ ఉదయం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు కొడుకు రోహిత్ శేఖర్ తివారీ తెలిపాడు. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు మ్యాక్స్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఇవాళ ఉదయం టీ ఇవ్వడానికి వెళ్లగా.. ఆయన అపస్మారక స్థితిలో కనిపించారని.. వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తివారీ కొడుకు రోహిత్ వివరించాడు.

ఎన్డీ తివారీ వయసు ప్రస్తుతం 91 సంవత్సరాలు. ఆయన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు. ఆయన గవర్నర్‌గా పనిచేస్తున్న సమయంలో రాజ్‌భవన్‌లో రాసలీలలు సాగిస్తుండగా ఓ చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఆయన అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత వారసత్వపు కేసు కొన్నాళ్లు ఆయనను వెంటాడింది. ఇలాంటి అనేక సందర్భాలు ఎన్డీ తివారీని మానసికంగా కుంగదీశాయి. 

Similar News