సినిమా టిక్కెట్లు పెరగనున్నాయి..? ఎంతో తెలిస్తే ..

Update: 2018-06-22 03:45 GMT

జీఎస్‌టీ తో రానున్న రోజుల్లో తమ రంగానికి కష్ట కాలమేనని సినీ పరిశ్రమ  హెచ్చరికలు జారిచేస్తోంది. జీఎస్‌టీ వల్ల నిర్మాతలు 90 శాతం నష్టాలను చవిచూస్తున్నారని అంటోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంపై జీఎస్‌టీ ప్రభావం అన్న అంశంపై అసోచాం, పీడబ్లు్యసీ గురువారం నిర్వహించిన సమావేశంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..నష్టాలు పొందుతున్న నిర్మాతలకు జీఎస్‌టీ అదనపు భారమేనని అభిప్రాయపడ్డారు.

కాగా సమావేశంలో జీఎస్‌టీ వలన నిర్మాతలకు 30% అదనంగా ఖర్చు పెరుగుతోంది. రూ.100 దాటిన టికెట్‌పై పన్ను 28 శాతముంది. అంటే రూ.150 టికెట్‌లో రూ.42 జీఎస్‌టీ ఉంది. ఇది పరిశ్రమకు అనుకూలం కాదు. త్వరలో రూ.100 టికెట్‌ కాస్తా రూ.150, రూ.150 విలువగలది రూ.200లకు పెంచాలని ప్రభుత్వాలకు సిఫారసు చేయనున్నట్టు తెలుస్తోంది. 

Similar News