అత్యాచార నిందితులకు మరణ శిక్షే సరి : మోడీ

Update: 2018-08-15 06:58 GMT

72వ స్వాతంత్ర్య దినోవత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలో జాతీయ జెండాను ఎగురవేశారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ప్రధాని హోదాలో ఐదవ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ గంటా 20 నిమిషాల పాటు జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆరంభంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికల గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరాం, ఉత్తరాఖండ్ గిరిజన ప్రాంతాలకు చెందిన బిడ్డలు ఎవరెస్ట్‌పై జాతీయ జెండాను ఎగరవేసి దేశ ఔనత్యాన్ని మరింత ఇనుమడింపచేశారని కొనియాడారు.

మహిళలపై నేరాలు చేసే రాక్షస శక్తులు దేశంలో ప్రబలుతున్నాయని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.  మహిళలపై వరుస అత్యాచార ఘటనలు కలవరానికి గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడానికి చర్యలు చేపట్టామన్న మోడీ రేపిస్టులకు మరణ దండనే సరని మోడీ అన్నారు.

Similar News