కేరళ వరదల సాయంలో రియల్ హీరో...

Update: 2018-08-20 04:48 GMT

కేరళ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మత్స్యకారులు ప్రత్యేక బృందాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్‌డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ సిబ్బందికి మత్స్యకారులు వెన్నంటే ఉంటున్నారు. తమవంతు సహకారం అందిస్తూ బాధితులకు సాయం చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షిస్తూ సహాయక శిబిరాలకు తరలించడంలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

వరద సహాయక చర్యల్లో కేపీ జైస్వాల్ అనే మత్స్యకారుడు హీరోగా మారాడు. రక్షించిన వారిని సహాయక శిబిరాలకు తరలించేందుకు బోట్లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో నీటిలో ఉన్న బోటు ఎక్కేందుకు మహిళలు, చిన్నారులు కష్టాలు పడుతుంటే జైశ్వాల్ వారికి మెట్టుగా మారాడు. నీటిలో అతడు వంగి తన వెన్నును మెట్టుగా మార్చాడు. అతడి వెన్నుపై బాధితులు కాళ్లు వేసి బోటులోకి ఎక్కారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైస్వాల్ సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Similar News