గాలి కోసం.. విమానం కిటికీ తెరిచాడు.. ఇంతలో చూస్తే!

Update: 2018-05-02 04:30 GMT

ఇంట్లో లేదా ఆఫీసు లోనో గాలి ఆడకపోతే ఎవరైనా ఏమి చేస్తారు.. కిటికీలు తీస్తారు. అదే విమానంలో అయితే అలాగే చేస్తారా..?కానీ అదే పని చేశాడో వ్యక్తి విమానంలో సరిగా గాలి ఆడటం లేదని ఫ్లైట్ ఎమర్జెన్సీ  డోర్ తెరిచాడు. ప్రయాణికుల్ని కాసేపు తత్తరపాటుకు గురిచేశాడు.. ఈ ఘటన  చైనాలోని మిన్యాంగ్‌ నాన్‌జియావో ఎయిర్‌పోర్ట్‌లో  జరిగింది. చైనాకు చెందిన చెన్‌(25) అనే వ్యక్తి విమానంలోని అత్యవసర ద్వారం వద్ద సీట్లో కూర్చున్నాడు.అయితే అక్కడ సరిగా గాలి ఆడక ఇబ్బంది పడుతున్నాడు. సిబ్బందిని పిలిచి సీట్ మార్పించామని కోరలేదు, పైగా అతను విమాన ప్రయాణానికి కొత్త కావడంతో దాన్ని కాస్త బస్సు అనుకోని గాలికోసం ఎమర్జెన్సీ  కిటికీ తెరిచాడు. అంతే ఒక్కసారిగా బయటి గాలి ఫ్లైట్ లోకి చొచ్చుకుని వచ్చింది. దీంతో ఫ్లైట్ ఒక్కసారిగా అటు ఇటు ఊగడం ప్రారంభించింది. వెంటనే అప్రమత్తమత్తమైన సిబ్బంది ద్వారాన్ని మూసివేశారు. అయితే అందులోని ప్రయాణికులకు ఆ సమయంలో  ప్రాణభయం పట్టుకుంది. ఫ్లైట్ కూలిపోతుందేమోనని భయాందోళన చెందారు. కానీ అదృష్టవశాత్తు ఈ పరిణామం ఫ్లైట్ టేకాఫ్ సమయంలో జరిగింది కాబట్టి ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు కారణమైన చెన్‌ కు  నాన్‌జియావో ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఫైన్ వేసి 15 రోజుల పాటు ఫ్లైట్ జర్నీ నిషేధించారు. 

Similar News