సచివాలయంలోకి చిరుతపులి ప్రవేశం..

Update: 2018-11-05 06:42 GMT

గుజరాత్‌ సెకట్రేరియట్‌లోకి అనుకొని అతిధి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది కళ్లగప్పి మెల్లగా లోపలికి ఎంటర్‌ అయింది. గాంధీనగర్‌లోని  అత్యంత భారీ భద్రతను దాటుకుని లోపలికి  వచ్చింది. గేట్లు మధ్య ఉన్న ఖాళీ స్ధలం ద్వారా  ప్రవేశడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. అహ్మదాబాద్ లో కొత్తగా నిర్మించిన సచివాలయం భవనం, ముఖ్యమంత్రి కార్యాలయం పరిసరాల్లోకి ఓ చిరుతపులి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది.

 చిరుత సంచారం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో  విషయం వెలుగులోకి వచ్చింది. చిరుత ఎంటరైన విజువల్స్‌ చూసి  అధికారులు అవాక్కయ్యారు.ఆ వెంటనే రంగ ప్రవేశం చేసిన అధికారులు, ఉదయం నుంచి చిరుత జాడ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇది బయటకు వెళ్లినట్టు ఎక్కడా నిర్ధారించలేకపోతున్న అధికారులు, ఇది ఇంకా సచివాలయం క్యాంపస్ లోనే ఉండి వుండవచ్చని అనుమానిస్తున్నారు.  మరోవైపు సమీపంలోని ఇంద్రోదా పార్క్ నుంచి ఈ చిరుత పులి ప్రవేశించి వుండవచ్చని భావించిన అధికారులు దాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇక తాజా ఘటనలో అలర్టైన అధికారులు చిరుత మళ్లీ వస్తే పట్టుకునేందుకు బోనులను ఏర్పాటు చేశారు.  చిరుత  ఎటు వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సచివాలయంలో కరువైన నిఘాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెక్యూరిటీ ఏమైపోయారని ప్రశ్నిస్తున్నారు. చిరుత రెండు సార్లు ప్రధాన గేటు నుంచి లోపలికి ..బయటికి వచ్చే దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Similar News