చేపలు అమ్ముకునే అమ్మాయి వరద బాధితులకు రూ.1,15,000 సాయం చేసింది..

Update: 2018-08-18 11:27 GMT

స్పందించే హృదయం ఉండాలే కానీ ఏ చిన్న సాయమైనా చేయొచ్చని నిరూపించింది కేరళకు చెందిన మహిళ హనన్ హమీద్. ఆమెను చదువుకోవడం కోసం చేపలు అమ్ముకుంటుందని సామాజిక మాధ్యమాలు ట్రోల్ చేశాయి. స్వయంగా ముఖ్యమంత్రి పినరన్ రంగంలోకి దిగి ట్రోల్ చేస్తున్న వారిని  శిక్షించాలంటూ పోలీస్ శాఖను ఆదేశించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన తనకు ఆ అదృష్టం లేదేమోనని సందేహం వ్యక్తం చేసింది. దాంతో ఆమె పరిస్థితి చూసి ఆమె చదువుకోవాలని ఆశించి కొందరు దాతలు విరాళాల రూపంలో కొంత నగదును కూడా పంపారు. అయితే ఆ మొత్తం  లక్షా పదిహేనువేల రూపాయలను కేరళ వరద బాధితుల కోసం ఉపయోగించమంటూ ఇచ్చేసింది. తన పట్ల ఈ మాత్రం జాలి చూపించినందుకు ధన్యవాదాలు.. నేను స్వయంకృషితో నన్ను నేను పోషించుకోగలను ప్రస్తుతం వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారని అందుకోసం ఆ డబ్బును వినియోగించాలని సూచించింది. దాంతో సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసలు మొదలయ్యాయి.

Similar News