చూయింగ్‌గమ్‌ నమిలినందుకు ఐఎఎస్‌ అధికారి సస్పెండ్

Update: 2017-12-30 10:41 GMT

బెంగళూరులో ఒక ప్రొబెషనరీ ఐఎఎస్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రొబెషనరీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి గెహ్లాట్.. కర్నాటక రాష్ట్ర గీతాన్ని అవమానించారు. తుమకూరు జిల్లాలోని సిరాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. రాష్ట్ర గీతం ఆలపిస్తున్న సమయంలో సీఎంతో పాటు ఇతర అధికారులు వేదికపై నిలుచుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి కూడా గీతాలాపన కోసం నిలబడ్డారు. కానీ ఆమె ఆ గీతాన్ని అవమానించారు. పాట వస్తున్న సమయంలో కలెక్టర్ ప్రీతి చువింగ్ గమ్ నములుతూ కనిపించారు. రాష్ట్ర గీతం ముగిసిన తర్వాత కూడా ఆమె అలాగే చుయింగ్ నములుతూ ఉన్నది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన నేపధ్యంలో పలు విమర్శలు ఎదురయ్యాయి. దీంతో కర్నాటక ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రత్నప్రభ ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.

Similar News