కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ

Update: 2018-11-06 05:28 GMT

కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు శ‌నివారం జరిగిన ఉప ఎన్నిక‌ల్లో... కమలనాథులకు పరాభవం ఎదురైంది. 3 సిట్టింగ్ ఎంపీ సీట్లకుగాను బీజేపీ రెండింటిలో ఓటమి చెందింది. బీజేపీ కంచుకోటలైన మాండ్య , బళ్లారిలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పాగా వేసింది. మాండ్య ఎంపీ సీటులో జేడీఎస్ అభ్యర్థి శివరామ్ గౌడ విజయం సాధించగా..బళ్లారి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

3 సిట్టింగ్ ఎంపీ సీట్లకుగాను ఒక చోట మాత్రమే బీజేపీకి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత , మాజీ సీఎం యడ్యూరప్ప రాజీనామాతో ఖాళీ అయిన శివమొగ్గ పార్లమెంటరీ స్థానంలో ఆయన కుమారుడు రాఘవేంద్ర ఆధిక్యంలో ఉన్నారు. ఇక రామనగర అసెంబ్లీ సీటుకి తలపడిన సీఎం కుమార స్వామి సతీమణి విజయం సాధించారు. అలాగే జమ్‌ఖండీ అసెంబ్లీ సీటులో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద సిద్ధు న్యామగౌడ గెలిచారు.

Similar News