నన్ను అరెస్టు చేయడం దారుణం..

Update: 2017-12-12 06:45 GMT

ఖమ్మంలో ప్రొఫెసర్ కంచ ఐలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్ల కురుమల రాష్ట్ర మహాసభలో పాల్గొనడానికి వెళ్ళిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొల్ల కురుమల సభకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. అయితే గొల్ల కురుమల సభకు వెళ్ళనీయకుండా అడ్డుకోవడంపై కంచ ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు తాను హాజరైతే తప్పేమిటని ప్రశ్నిన్నారు. పోలీసులు గొల్లకురుమల సభను అడ్డుకుంటే సీపీఎం కార్యాలయంలోనే సభ పెడతాననని అన్నారు.

గొర్రెల పెంపకందారుల మహాసభ ఖమ్మం జిల్లాలో జరిగింది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంచె ఐలయ్య హాజరయ్యారు. కానీ ఈ మహాసభకు అనుమతి లేదంటూ  పోలీసులు  ఐలయ్యను అరెస్టు చేసి ఖమ్మం టూటౌన్‌ పీఎస్‌కు తరలించారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన  మాట్లాడుతూ సభకు అనుమతి లేదని నన్ను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. భద్రతా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరితే అరెస్టు చేయిస్తారా ? అని ప్రభుత్వాన్ని ఐలయ్య ప్రశ్నించారు. బహిరంగ సభ నిర్వహించి తీరుతామని సభ నిర్వహకులు చెబుతున్నారు.

Similar News