మహిళలపై కమల్ హసన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-03-09 09:54 GMT

మక్కళ్ నీది మయ్యం పార్టీ పెట్టిన తర్వాత.. కమల్ హసన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకర్షించేందుకు ఆచితూచి మాట్లాడుతున్నారు. తాజాగా.. అంతర్జాతీయ మహిళా దితనోత్సవం సందర్భంగా.. చెన్నై శివారులోని ఓ ప్రయివేట్ కాలేజీ స్టుడెంట్స్ తో కమల్ ఇష్టాగోష్టి చర్చకు హాజరయ్యారు. విద్యార్థినీ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

మహిళల శక్తి గురించి.. మహిళల చేతికి అధికారాన్ని అప్పగించే విషయాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళల చేతికి ఇంటి తాళం చేతులు అప్పగించేందుకు ఉన్న ధైర్యం.. దేశాన్ని అప్పగించే విషయంలో ఎందుకు ఉండదని ప్రశ్నించారు. తనకు చీర కట్టుకోవచ్చు అనే విషయాన్ని తాను ధైర్యంగా చెప్పగలనని చెప్పారు. మహిళలను, వారి శక్తికి గౌరవిస్తేనే దేశానికి దశ దిశ బాగుంటాయని స్పష్టం చేశారు.

తన తల్లి కూడా తనకు మహిళలను గౌరవిస్తేనే జీవితానికి అర్థం పరమార్థం అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని.. సెంటిమెంట్ ను టచ్ చేశారు. దీంతో.. ఎన్నికల కోణంలో కమల్ హాసన్.. దూర దృష్టితో నడుచుకుంటున్నాడనీ.. అసలు సమయానికి అన్ని వర్గాలనూ దగ్గర చేసేలా ఆయన ప్రణాళిక రూపొందించుకున్నారని అంతా అంటున్నారు.
 

Similar News