జగన్‌-రమణ దీక్షితులు భేటీ; ఆపరేషన్‌ గరుడా!

Update: 2018-06-09 02:45 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు కలుసుకోవడంపై ప్రత్యర్ధులు రాజకీయ అస్త్రాలు సంధింస్తున్నారు.. జగన్ డైరెక్షన్ లోనే  రమణదీక్షితులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు తమ సమస్యలు రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రతిపక్ష నేత దృష్టికి తెచ్చామని.. అందులో భాగంగానే జగన్ ను కలిశానని రమణదీక్షితులుచెబుతున్నారు.

అయితే ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు  స్పందించారు. 'రమణదీక్షితులు గారు ప్రతిపక్ష నేత జగన్‌ గారిని బహిరంగంగా కలిశారు. ఒకరేమో ఇది ఆపరేషన్‌ గరుడలో భాగమన్నారు. మరో తీవ్రవాది మాట్లాడుతూ.. దీక్షితులుగారు జగన్‌కు పాదాకాంత్రమయ్యారని అంటాడు. వేరొక ఉగ్రవాది.. ఇరువురికీ బంధుత్వాన్ని అంటగడతాడు. ఇంకో చానెల్‌లో అయితే శ్రీ వైష్ణవులకు ఇది కూడని పని అని ఏవో వైష్ణవ సంఘాలు అన్నట్లు వార్తలు ప్రసారం చేశాయి' అంటూ కృష్ణరావు తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. 

Similar News