భారీ భూకంపం.. 82 మంది మృతి

Update: 2018-08-06 02:23 GMT

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. లాంబాక్‌ దీవుల్లో ఆదివారం రాత్రి 7గంటల 30నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూమి భారీగా కంపించడంతో. పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదమంలో  82 మంది మరణించారు. వందలాది మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. లాంబాక్ దీవిలో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 7గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు. లాంబాక్‌ దీవుల్లోని భూగర్భంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు యూఎస్‌జీఎస్‌ అధికారులు వెల్లడించారు. వారం రోజుల క్రితం ఇదే దీవిలో భూకంపం సంభవించగా 17 మంది మరణించారు. ఇప్పుడు వచ్చిన భూకంపం దాని కంటే కూడా ఎక్కువేనని అధికారులు తెలిపారు.

 

Similar News