భారత్ ఒక అడుగు వేస్తే.. మేము రెండడుగులు వేస్తాం : ఇమ్రాన్ ఖాన్

Update: 2018-07-27 02:00 GMT

పాకిస్థాన్ లో బుధవారం జరిగిన ఎన్నికల్లో  పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ  అత్యధిక సీట్లు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. పాకిస్తాన్‌ పార్లమెంటులో మొత్తం 272 స్థానాలున్నాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మెజార్టీ 137 సీట్లు ఉండాలి. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ పీటీఐ కి 119 స్థానాలను కైవసం చేసుకుంది. పీఎంఎల్‌-ఎన్‌ పార్టీకి 63 సీట్లు దక్కాయి. ఇక పీపీపీ 38 స్థానాలను, ఇతరులు 50 స్థానాలను దక్కించుకున్నారు. కాగా అధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయిన పీటీఐ ఇతరులతో కలిసి ప్రభత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్బంగా భారత్‌–పాక్‌లు మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడానికి ముగింపు పలికి ఉపఖండంలో సుస్థిరతకు ప్రయత్నం చేయాలన్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాల కోసం భారత్‌ ఒక అడుగు ముందుకేస్తే మేం రెండడుగులు వేస్తాం. కానీ ఎవరో ఒకరు ఈ దిశగా చొరవతీసుకోవాలి. అని కాబోయే ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

Similar News