మద్యం సేవించి వస్తే కఠిన చర్యలు: రజత్‌కుమార్‌ 

Update: 2018-12-06 12:40 GMT

ఎన్నికల సమయానికి ఇంకా కొన్ని గంటలే మిగిలాయి. అయితే పోలింగ్ బూత్ వద్ద ఎలా వ్యవహరించాలో తెలంగాణ ఈసీ రజత్ కుమార్ తెలిపారు. ‌ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ వద్దకు సెల్ ఫోన్స్, కెమెరాలు నిషేధించామని, అలాగే మందు బాబులు మధ్యం సేవించి పోలింగ్ బూత్ వద్దకు వస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చిరించారు, అలాగే ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని వృద్దులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా పోలింగ్ శాతం 55 కంటే ఎక్కవ లేనేలేదని, ఈసారి మాత్రం ఏడున్నర లక్షల మంది మొదటి సారి ఓటు వేస్తున్నారని తెలిపారు. శుక్రవారం ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అన్ని సంస్థలకు సెలవు ఇవ్వాలని తెలంగాణ ఈసీ రజత్ కుమార్ ఆదేశించారు.

Similar News