మాతృప్రేమను కళ్లకు కట్టిన తల్లి ఆవు ఏంచేసిందంటే...

Update: 2018-01-30 11:05 GMT

కళ్ల ముందు కన్నబిడ్డకు...జరగరానిది జరిగితే తల్లి పడే బాధను ఊహించలేం. బిడ్డ మళ్లీ పూర్వ స్థితికి వచ్చే వరకు...తల్లి మనసు తల్లడిల్లుతుంది. మనుషులకే మానవత్వం ఉందనుకుంటే...పొరపాటే. నోరు లేని మూగ జంతువులకూ మనసు ఉంటుందని నిరూపించింది ఓ ఆవు. గాయంతో విలవిలలాడుతున్న లేగ దూడను చూసి ఓ తల్లి ఆవు తట్టుకోలేకపోయింది. గాయపడ్డ తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుంటే...ఆవు కూడా పరుగులు పెట్టింది. మాతృప్రేమను కళ్లకు కట్టిన ఆవు, దూడ ఘటన కర్ణాటలోకి హవేరీలో జరిగింది.

ఓ రెండు నెలల లేగదూడ కాలికి గాయమైంది. దీంతో దూడ కాలికి ఇన్ఫెక్షన్‌ సోకడంతో నడవలేకపోయింది. దూడ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో...ఆవు మనసు విలవిలలాడింది. దూడ పరిస్థితిని గమనించిన యజమాని చికిత్స కోసం... ఓ ట్రాలీ ఆటోలో ఎక్కించి సమీపంలోని వెటర్నరీ ఆసుప్రతికి బయలుదేరాడు. దూడను ఆటోలో తీసుకెళ్తుంటే తల్లి ఆవు వాహనాన్ని అనుసరిస్తూ... పరుగులు పెట్టింది. ఈ నెల 25న దూడను ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స చేసిన వైద్యులు...దూడ కోలుకోవడంతో డిశ్చార్జ్‌ చేశారు. 

Similar News