తాటి తేగలు అంటే తెలుసా ?..ఎలాంటి ఆరోగ్యమో తెలుసా ?

Update: 2017-12-13 07:31 GMT

తాటి చెట్టు విత్తనం నుండి వెలువడిన వేరుయో తాటి తేగ అంటారు, ఇక వాటిని తిన్నారంటే ఆ రుచికి ఫిదా కావల్సిందే .తూర్పుగోదావరి  జిల్లా కొత్తపల్లి మండలం .కోనపాపపేట నుంచి తొండంగి మండలం.  పెరుమాళ్లపురం వరకూ  సాగరతీరంలో. తేగలు అమ్మకాలు ముమ్మరంగా సాగుతుంటాయి. వాటిని ఎలా కాల్చుతారో చూడండి.
 ముఖ్యంగా తేగలను సేకరించడం అనేది వారికి కొంత ఇబ్బంది,గానే వున్న మరి అదే జీవనాధారంగా మారింది. అంతేకాదు  ఇతర ప్రాంతలైన బెంగళూరు,హైదరాబాద్, విశాఖపట్టణం, రాజమండ్రి .వంటి పట్టణాలకు ఎగుమతి చేసిన తాజాగానే  వుంటాయని వారు చెబుతున్నారు.
 చూశారుగా తేగలు మంచి పౌష్టికాహారం కూడా వాటిలో 60% పిండి పదార్థంతో పాటు పీచు పదార్థం కూడా వుంటుంది. వాటిని తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాహారంగా చెప్పవచ్చు.  

Similar News