లక్ష దాటిన హరీష్ రావు మెజార్టీ.. 1,06,816

Update: 2018-12-11 06:50 GMT

హరీష్‌ రావు రికార్డు సృష్టించారు. సిద్దిపేటలో హరీష్‌ను ప్రజలు రికార్డుస్థాయి మెజార్టీతో గెలిపించారు. హరీష్‌ రావు లక్షకు పైగా మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 1,06,816 ఓట్ల మెజార్టీ సాధించి తెలంగాణలో సరికొత్త రికార్డు సృష్టించారు. పోలైన ఓట్లలో 80 శాతానికి పైగా ఓట్లు హరీష్ రావుకు పోలయ్యాయి. 2004 ఉప ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీష్ రావు ఆ తర్వాత వరుస విజయాలు సాధిస్తూనే ఉన్నారు. 2008 ఉప ఎన్నిక, 2009 సాధారణ ఎన్నికలు, 2010 ఉప ఎన్నిక, 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో హరీశ్ రావుకు 1,08,699 ఓట్లు వచ్చాయి. 
హరీష్ రావు మెజార్టీలు
2004 ఉప ఎన్నిక - 24,594
2008 ఉప ఎన్నిక - 58,000
2009 సాధారణ ఎన్నికలు - 64,667
2010 ఉప ఎన్నిక - 93,858
2014 సాధారణ ఎన్నికలు - 95,328

Similar News