వ్యతిరేకంగా ప్రచారం చేస్తే గ్యాంగ్‌రేప్ చేస్తాం!

Update: 2018-11-05 06:10 GMT

గోవా బీజేపీ నాయకుడు సుభాష్ శిరోద్కర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తన అనుచరులు రేప్ చేస్తానని బెదిరింపులకు గురిచేసినట్లు గోవా మహిళా కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ దియా షెట్కర్ మీడియాకు వెల్లడించారు. బెదిరింపులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం దియా షెట్కర్ కు ఓ ఫోన్ కాల్ లో నేను శిరోద్కర్ మద్దతుదారుడిగా చెప్పాడు. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ దూషణలకు పాల్పడ్డాడు. శిరోద్కర్ నియోజకవర్గంలో కాలుపెట్టరాదని మా నిబంధనలు ఉల్లంగిస్తే సామూహిక అత్యాచారానికి పాల్పడతామని హెచ్చరించారని ఆమె తెలిపింది. పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా దియా పేర్కొన్నారు. కాగా దియా షెట్కర్ ఆరోపణలపై సుభాష్ శిరోద్కర్ ఇప్పటివరకు స్పందించలేదు.

Similar News