తొలి పార్లమెంటేరియన్‌ కన్నుమూత!

Update: 2018-06-09 03:41 GMT

ప్రముఖ స్వాతంత్రా సమరయోధుడు, తొలి పార్లమెంటేరియన్‌ కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ (98) కన్నుమూశారు. వయసుమీదపడటంతో అనారోగ్యానికి గురైన తిలక్  శుక్రవారం కుమారుడి స్వగృహంలో కన్నుమూశారు. విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం మడలం అక్కయ్య పాలెం ఆయన స్వగ్రామం. 1952 నుంచి 1957 మధ్య ఏర్పడిన తొలి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు.విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గంనుంచి దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన వారిలో  రెండవ వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.మొదటగా కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించిన తిలక్  తదనంతరం సోషలిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై సోషలిస్టు పార్టీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. పార్ల మెంట్‌కు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. కాగా ఇప్పటివరకు తొలి పార్లమెంటుకు ఎన్నికైన ఎంపీలలో జీవించి ఉన్నది తిలకే. ఇక అయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు. 

Similar News