'భరత్‌ అనే నేను' సినిమాపై పార్టీ అధినేత ఫిర్యాదు

Update: 2018-06-05 03:25 GMT

ప్రిన్స్  మహేష్ బాబు, దర్శకుడు కొరటాల కాంబినేషన్ లో వచ్చిన సినిమా  'భరత్ అనే నేను' పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా  ప్రేక్షకులను బాగానే అలరించింది. దాదాపు 200 కోట్లు గ్రాస్ వసూల్ చేసిన ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు ఓ వ్యక్తి. సినిమాలో  ‘నవోదయం పార్టీ’పై దుష్ప్రచారం చేశారని గుంటూరు అర్బన్‌ ఎస్పీకి  ఆ పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు ఫిర్యాదు చేశారు. నవోదయం పార్టీని 2010లో స్థాపించి కేంద్ర ఎన్నికల కమిషన్‌తో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించామని..  'భరత్ అనే నేను'లో నవోదయం పార్టీ పట్ల ప్రజల్లో ద్వేషం కలిగించేలా చూపించారని ఆరోపించారు. తమ పార్టీ పేరును వాడుకోవడమే కాకుండా పార్టీ జెండాలో ఉన్న ఉదయించే సూర్యుడు గుర్తుని దుర్వినియోగం చేశారని అన్నారు. ఈ సందర్బంగా ఎస్పీని కలిసిన నల్లకరాజు సినిమాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 

Similar News