సీబీఐ డైరెక్టర్లను సెలవుపై మాత్రమే పంపాం: జైట్లీ

Update: 2018-10-24 09:12 GMT

సీబీఐ డైరెక్టర్‌ను సెలవుపై పంపడాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్ధించుకున్నారు. దేశంలోనే  అత్యున్నత దర్యాప్తు సంస్ధ అయిన సీబీఐ గౌరవాన్ని కాపాడటమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. సీబీఐలో అత్యున్నత స్ధానంలో ఉన్న డైరెక్టర్‌, స్పెషల్ డైరెక్టర్‌ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారని ఈ వ్యవహారంలో  సీవీసీ సూచన మేరకే తాము నడుచుకున్నామన్నారు. ఇరువురిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు అంశం సీవీసీ పరిధిలోనే ఉందన్నారు. సీబీఐ డైరెక్టర్‌, స్పెషల్ డైరెక్టర్ల ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలనే తాము కోరుకుంటున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పరస్పరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఒకరిపై ఒకరు విచారణ చేస్తే అంతకు మించి అన్యాయం ఉండదన్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు సీబీఐ డైరెక్టర్‌, స్పెషల్ డైరెక్టర్‌లను సెలవుపై మాత్రమే పంపామని జైట్లీ గుర్తు చేశారు.   

Similar News