విటమిన్ డితో ఉపయోగాలు

Update: 2017-09-17 16:28 GMT

సూర్య కిరణాల ద్వారా మాత్రమే శరీరానికి అవసరమైన విటమిన్ డి నేరుగా ఉత్పత్తి అవుతుంది. రోజు వారీ ఆహారంలో ఓ వ్యక్తి పది గ్లాసు లు పాలు తీసుకుంటే కనీస మొత్తం లో విటమిన్ డి శరీరంలో చేరుది. భూమధ్యరేఖకు దూరంగా నివసించేవారిలో డి విటమిన్ లోపానికి ప్రధాన కారణం తగినంత సూర్యరశ్మి లభించకపోవడమే. కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు భూమధ్యరేఖకు దూరంగా ఉన్నాయి. విటమిన్ డి లోపం వల్ల కలిగే పెల్లాగ్రా అనే చర్మవ్యాధితో  బాధపడే వాళ్లు రోజూ 20 నుంచి 30 నిమిషాలు సూర్యకాంతిలో నిలబడితే కొన్ని రోజుల్లోనే ఇది సాధారణ స్థితికి చేరుకుంటుంది. నల్లజాతీయుల్లో ప్రొస్టేట్ కేన్సర్ ప్రబల వ్యాధిగా మారడానికి సూర్యరశ్మి లోపమే ముఖ్య కారణం.

శరీరానికి ఎంత మేర అవసరమో అంతే మొత్తంలో సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి ని గ్రహిస్తుంది తప్ప ఎక్కువ స్థాయిలో తీసుకోవడం సాధ్యపడదు. ఉరోస్థి (గుండె/ ఊపరితిత్తులు ఉండే ఎముకల గూడు) నొప్పి అధికంగా ఉంటే విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతున్నట్లే. విటమిన్ డి శరీరం వినియోగించుకునే ముందు మూత్రపిం డాలు, కాలేయం ద్వారా ఉత్తేజితమవుతుంది. మూత్రపిండాల వ్యాధి లేదా కాలేయ సమస్యలు తలెత్తినప్పుడు విటమిన్ డి సక్రమంగా అందకపోతే శరీరం యొక్క సామర్థ్యం బలహీనమవుతుంది.

Similar News