మంత్రి చందూలాల్‌కు బిగ్ షాక్

Update: 2018-12-11 08:34 GMT

కారు వేగంగా దూసుకుపోతున్నా..కొన్నిచోట్ల దెబ్బతగులుతోంది. కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు షాక్‌ తగిలింది. తాజాగా మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌కు బిగ్ షాక్ తగిలింది. అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ వచ్చినా.. తన సొంత నియోజకవర్గం ములుగులో మాత్రం చందూలాల్ ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన అజ్మీరా చందూలాల్.. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బానోత్ దేవీలాల్, బీఎల్ఎఫ్ తరపున నారాయణ బరిలోకి దిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చందూలాల్.. ఓటమిపాలవుతారని టీఆర్ఎస్ నేతలు ఎవరూ ఊహించలేదు. ఆయనతోపాటు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు కూడా ఓటమి పాలయ్యారు.
 

Similar News