వాజ్‌పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ తాజా హెల్త్ బులెటిన్ విడుదల!

Update: 2018-08-16 06:12 GMT

మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. ఆయన ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదని ఉదయం 11 గంటల తర్వాత విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రకటించింది. వాజ్‌పేయికి వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. 93 ఏళ్ళ వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించిదన్న వార్తలతో బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. 

 చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయిని పరామర్శించడానికి ప్రముఖులు క్యూ కట్టారు. వెంకయ్య నాయుడు ఎయిమ్స్‌కు చేరుకుని వాజ్‌పేయిను పరామర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా వాజ్ పాయిని పరామర్శించారు. ఇక కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎయిమ్స్‌‌కు వచ్చి వాజ్‌పాయి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వాజ్ పాయిని పరామర్శించడానికి పలువురు కేంద్ర మంత్రులు , బీజేపీ నేతలు ఎయిమ్స్‌కు వస్తున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ సింగ్ కాసేపట్లో వాజ్ పాయిని పరామర్శిస్తారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇవాళ మధ్యహ్నం ఎయిమ్స్‌కు వచ్చి మాజీ ప్రధానిని పరామర్శిస్తారు.

Similar News