ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చట్ట విరుద్ధం : అసదుద్దీన్ ఓవైసీ

Update: 2017-12-28 10:56 GMT

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చట్ట విరుద్ధమన్నారు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఓవైసీ ముస్లింలను సంప్రదించకుండా బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందన్నారు. ఈ బిల్లుతో ముస్లిం మహిళలకు న్యాయం జరగదన్నారు అసదుద్దీన్‌ ఓవైసీ. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుతో ఆర్టికల్‌ 14, 15కి ఉల్లంఘన జరుగుతుందన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ద్వారా ఫిర్యాదు చేస్తే అరెస్ట్‌ చేసే పరిస్థితి ఏర్పడుతుందని, భర్త జైలుకెళ్తే ఆ మహిళ పోషణ బాధ్యత ఎవరు తీసుకుంటారన్నారు. ముస్లింల్లో వివాహం సివిల్‌ వ్యవహారమైతే కేంద్రం మాత్రం క్రిమినల్‌ కేసులు పెట్టేలా చట్టం తేవడం సరైంది కాదన్నారు. వాస్తవాలకు దూరంగా ట్రిపుల్‌ తలాక్ బిల్లు ఉందన్నారు.
 

Similar News