అతడు నన్ను నమ్మించి మోసం చేశాడు: అనుష్క

Update: 2018-07-13 02:07 GMT

అనుష్క ఈ  పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె నటన. కత్తి పట్టడంలోనూ శత్రువులను మట్టికరిపించడంలోనూ ఇప్పట్లో  ఆమెకు సాటిలేరు. భారతదేశం గర్వించదగ్గ చిత్రం బాహుబలి. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాంటి అనుష్క ప్రస్తుతం ఖాళీగా ఉంటోందట బాహుబలి చిత్రం తరువాత ఈ అమ్మడు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి ఒప్పుకుంది. ఆ సినిమా కోసమే మిగతా ఏ సినిమాకీ సైన్ చేయలేదట. అయితే గౌతమ్ అనుష్కతో సినిమాని ఇప్పటివరకు మొదలు పెట్టలేదట. దాంతో అనుష్క గౌతమ్‌పై విరుచుకుపడుతోంది. సినిమా చేస్తానని నమ్మించి మోసం చేశాడని అంటోంది. పైగా వేరే సినిమాలు చేసుకోకుండా ఖాళీగా ఉండేలా చేశాడని ఆ అగ్రదర్శకుడిపై మండిపడుతోంది. 

Similar News