పాక్ ప్రధానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్

Update: 2018-09-02 15:31 GMT

పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నెలరోజులు కూడా గడవవకముందే అమెరికా అధ్యక్షుడి నోటా షాకింగ్ మాట విన్నారు ఇమ్రాన్ ఖాన్. పాక్‌కు సహాయంగా ఇవ్వాల్సిన 500 మిలియన్‌ డాలర్ల నిధులకు ఇటీవల యూఎస్‌ కాంగ్రెస్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ షాక్‌ నుంచి 
ఇమ్రాన్ ఖాన్ ఇంకా తేరుకోకముందే పాకిస్తాన్‌కు ట్రంప్‌ మరో ఝలక్ ఇచ్చారు.  ఉగ్రవాదుల ఏరివేతలో పాక్ ప్రభుత్వం విఫలమైందని.. తద్వారా  తామిచ్చే సహాయాన్ని మిలిటెంట్లపై దాడులకు పాక్‌ ఉపయోగిచలేపోయిందని అగ్రరాజ్యం అమెరికా వ్యాఖ్యానించింది. దీంతో పాకిస్థాన్  కు రావలసిన 300 మిలియన్‌ డాలర్లు ( 2130.15) కోట్ల రూపాయలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాక్ కు ఈ సహాయాన్ని నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ట్రంప్ నిర్ణయంపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన క్యాబినెట్ తో చర్చించినట్టు తెలుస్తోంది.

Similar News