అత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష

Update: 2017-12-15 06:06 GMT

దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవటం లేదు. మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళల భద్రతకు హామీలభించడంలేదు. తాజాగా నిర్భయ తరహ ఘటన కేరళలో చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం అసోం రాష్ట్రం నుంచి కేరళకు వచ్చిన మహ్మద్‌ అమీరుల్‌ ఇస్లాం(22) 2016 ఏప్రిల్‌ 28న పెరంబువర్‌కు చెందిన దళిత న్యాయ శాస్త్ర విద్యార్థిని(30) తన ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇస్లాం ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దుశ్చర్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టిన కేరళ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ కేసు  2012లో ఢిల్లీలో జరిగిన దారుణ నిర్భయ ఘటనను గుర్తుకు తెస్తోందని ఎర్నాకులం ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి ఎన్‌.అనిల్‌ కుమార్‌.. ఇస్లాంకు మరణ శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

Similar News