అజ్ఞాతవాసి సినిమా రివ్యూ

Update: 2018-01-10 02:04 GMT

 
  జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ -  డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో అజ్ఞాతవాసి సినిమా విడుద‌లైంది.  షూటింగ్ ప్రారంభం  నుండి  నేటి విడుద‌ల వ‌ర‌కు ఎన్నో వివాదాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా హ్యాట్రిక్ ఖాతాలో చేరిపోతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. 
క‌థ 
క‌థ 
ప్రముఖ వ్యాపారవేత్త, గోవింద భార్గవ్‌ అలియాస్‌ విందా(బొమన్‌ఇరానీ), విందా భార్య ఇంద్రాణి(కుష్బు) భార్య భ‌ర్త‌లు. ఒకానొక  సంద‌ర్భంలో గోవింద కొడుకుని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేస్తారు. దీంతో కొడుకులేని లోటును తీరుస్తూ వ్యాపార వ్య‌వ‌హారాల్ని చూసుకునే ఓ ఉద్యోగిని  (పవన్‌కల్యాణ్‌) అస్సాం నుంచి పిలిపిస్తుంది. అతనే  బాలసుబ్రహ్మణ్యం పేరుతో గోవింద కంపెనీలో పర్సనల్‌ మేనేజర్‌గా చేరతాడు. కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ  గోవింద కొడుకు హత్య కు కారణాలేంటి. ఎవ‌రు హ‌త్య చేశార‌నే కోణంలో నిందితుల‌కోసం  అన్వేషిస్తుంటాడు. ఇందులో సీతారామ్‌(ఆది పినిశెట్టి) పాత్ర ఏంటి? అసలు అస్సాం నుంచి వచ్చింది నిజంగా బాల సుబ్రహ్మణ్యమేనా? ‘అజ్ఞాతవాసి’గా అతను ఎందుకు వచ్చాడు? బాల సుబ్రహ్మణ్యంగా వచ్చిన వ్యక్తి అభిషిక్త భార్గవ ఎలా అయ్యాడు? అతనికి విందా కుటుంబానికి సంబంధం ఏంటి?​​​ అనే కీల‌కంగా తెరకెక్కించారు డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ 
ఎవ‌రు ఎలా చేశారు
మొద‌ట దుబాయ్ లో సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ మెంబ‌ర్ ఉమైర్ చెప్పిన‌ట్లు  అజ్ఞాతవాసి లో ప‌వ‌న్ వ‌న మాన్ షో అనే చెప్ప‌వ‌చ్చు. ఇక డైర‌క్ట‌ర్ శ్రీనివాస్ - ప‌వ‌న్ కాంబినేష‌న‌ల్ లో వ‌చ్చిన గ‌త చిత్రాల‌కంటే ఈ సినిమా ఇంకా బాగుంది. మాట‌ల‌మాత్రింకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైలాగ్స్ కు  విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కామెడీ సీన్స్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెల‌రేగిపోయాడ‌నే చెప్పుకోవ‌చ్చు. ఇక హీరోయిన్స్ కీర్తి సురేష్ , అను ఇమ్మాన్యుయెల్ పోటాపోటీగా యాక్ట్ చేశారు. అను క్యూట్ గా.. అను ఇమ్మాన్యుయెల్ హాట్ లుక్స్ తో ఆక‌ట్టుకున్నారు. ఈ సినిమాలో విల‌న్ ఆది పినిశెట్టి పాత్ర హైలెట్ గా నిలిచింది. ఇక సీనియ‌ర్ న‌టి కుష్బు ,  పవన్ ల మ‌ధ్య వ‌చ్చే సీన్లు చాలా బాగున్నాయి. రావు రమేష్, మురళి శర్మ, రఘుబాబు, వెన్నెల కిశోర్   అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే యాక్ట్ చేశారు.

టెక్నిక‌ల్ గా 
హారిక - హాసినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వ‌చ్చిన ఈ అజ్ఞాతవాసి  సినిమా విలువ‌లు బాగున్నాయి. కంటెంట్ ప‌రంగా పీక్స్ లో ఉండ‌గా సినిమా టేకింగ్ కూడా అలానే ఉంది. ఇక సినిమాటోగ్ర‌ఫీ మ‌నికంద‌న్ ప‌నితీరు బాగుంది. ఫ్రేం ఫ్రేం ఆడియ‌న్స్ ఆక‌ట్టుకునేలా చేసింది. మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అనిరుద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ విష‌యం సినిమా ఆడియో విడుద‌ల‌లోనే తెలిసిపోయింది. బయటకొచ్చి చూస్తే, గాలివాలుగా, స్వాగతం కృష్ణా సాంగ్ ఆకట్టుకున్నాయి. ఇక కోటగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. రచయిత, దర్శకుడిగా త్రివిక్ర‌మ్ ఇది హ్యాట్రిక్ అనే చెప్పుకోవాలి. జల్సా, అత్తరింటికి దారేది సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబోలో  అజ్ఞాతవాసి వ‌చ్చి చేరింది. త్రివిక్రమ్  దర్శకత్వ స్టాండర్డ్స్ ను మరో లెవల్ కు తీసుకెళ్లాయి.

 ఫైన‌ల్ గా

ప‌వ‌న్ హీరోగా  త్రివిక్రమ్  శ్రీనివాస్ డైర‌కక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా పర్ఫెక్ట్ కథతో పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది.  కాక‌పోతే  ఫస్ట్ హాఫ్ స్లో గా సాగడం, హీరోయిన్లతో వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టించడం ఫస్ట్ హాఫ్ లో మైనస్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో కథ రివీల్ అయినప్పటికీ అంతగా ఆకట్టుకోలేదు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సాదాసీదాగా సాగాయి. కానీ పవన్ కళ్యాణ్ మార్క్ యాక్షన్ సీన్స్ చిత్రాన్ని నిలబెడుతూ వచ్చాయి. ఓవరాల్ గా  ఈ సినిమా హిట్టా లేక యావ‌రేజ్ టాక్ ను సొంతం చేసుకుందా అనే విష‌యం తెలియాలంటే కొన్నిరోజు వెయిట్ చేయాల్సిందే. .

Similar News