స్వామి అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తల దాడి

Update: 2018-07-17 12:13 GMT

ప్రముఖ సంఘ సేవకుడు స్వామి అగ్నివేశ్‌.. క్రైస్తవమతానికి అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. మంగళవారం జార్ఖండ్‌లోని పాకూర్‌లో బీజేపీ అనుబంధ బీజేవైఎం కార్యకర్తలు ఆయనపై చేయిచేసుకున్నారు. ఆయన బట్టలను చించేశారు. అగ్నివేశ్ క్రిస్టియన్‌ మిషనరీలకు తొత్తుగా వ్యవహరిస్తూ గిరిజనులను మతం మారుస్తున్నారని బీజేవైఎం, ఆరెస్సెస్, వీహెచ్‌పీ కార్యకర్తులు ఆరోపించారు. అగ్నివేష్‌ బసచేసిన హోటల్‌ వద్ద ఉదయం నుంచి వేచిఉన్న బీజేపీ కార్యకర్తలు ఆయన బయటకు రాగానే ఒక్క ఉదుటున దాడికి తెగబడ్డారు. బీఫ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని వారు మండిపడ్డారు. కాగా, అగ్నివేష్‌ గతంలో హర్యానాలో ఎమ్మెల్యేగా వ్యవహరించడంతో పాటు రాజకీయాల నుంచి వైదొలగే ముందు మంత్రి పదవినీ నిర్వహించారు. అన్నా హజారే నేతృత్వంలో అవినీతి వ్యతిరేక పోరాటంలో అగ్నివేష్‌ చురుకుగా పాల్గొన్నారు. 

Similar News