యూపీలో కీచక పర్వం!

Update: 2018-07-24 10:46 GMT

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీలో ఓ కీచక పర్వం వెలుగు చూసింది. 16 ఏళ్ళ అమ్మాయిని కొందరు దుండగులు పొలాల నుంచి అడవుల్లోకి లాక్కుపోయి.. అసభ్యకరంగా ప్రవర్తించారు.. పొలంలో పనిచేస్తున్న తన తల్లికి ఆహారం తీసుకువెళ్తున్న ఈ బాలికను ఆమెకు తెలిసిన యువకుడే లిఫ్ట్ ఇస్తానంటూ.. వెంట బెట్టుకుపోగా.. దారిలో కొందరు ఆకతాయిలు అడ్డగించారు. బలవంతంగా ఆమెను లాక్కుపోయి..లైంగికంగా వేధించారు. తనను వదిలేయమని ఆమె ప్రాధేయపడినా ..ఆ దుర్మార్గులు వదలకపోగా..ఒకడు తన మొబైల్‌లో ఈ కీచకపర్వాన్ని చిత్రీకరించాడు. ఈ నెల 12 న జరిగిన ఈ ఘటన తాలూకు 6 నిముషాల నిడివి గల వీడియో బయటపడడంతో.. పోలీసులు స్పందించారు. దర్యాప్తు చేసి ప్రధాన నిందితుడితోపాటు ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరి కొందరిని కూడా త్వరలో పట్టుకుంటామని వారంటున్నారు.

Similar News