Rythu Bandhu: రైతులకు శుభవార్త.. రేపటి నుంచే రైతుబంధు..!
Rythu Bandhu: తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
Rythu Bandhu: రైతులకు శుభవార్త.. రేపటి నుంచే రైతుబంధు..!
Rythu Bandhu: తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. యాసంగికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం బుధవారం నుంచి రైతులకు అందించనున్నారు. ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి సాయం విడుదల చేయనున్నారు. సంక్రాంతిలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. రేపు ఉదయం నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు పైసలు జమ కానున్నాయి. ఈ సీజన్‌లో సుమారు 66 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.7,600 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది.