Stock Market: 'ట్రంప్ - మోదీ' మ్యాజిక్.. రాకెట్‌లా దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ

Stock Market: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మంగళవారం ఒక 'గోల్డెన్ డే'గా నిలిచిపోయింది. భారత్-అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దలాల్ స్ట్రీట్‌లో కాసుల వర్షం కురిపించింది.

Update: 2026-02-03 04:58 GMT

Stock Market: 'ట్రంప్ - మోదీ' మ్యాజిక్.. రాకెట్‌లా దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ

Stock Market: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మంగళవారం ఒక 'గోల్డెన్ డే'గా నిలిచిపోయింది. భారత్-అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దలాల్ స్ట్రీట్‌లో కాసుల వర్షం కురిపించింది. ఇన్వెస్టర్ల సంపద గంటల వ్యవధిలోనే లక్షల కోట్లు పెరగడంతో మార్కెట్ వర్గాల్లో పండగ వాతావరణం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం భారత ఈక్విటీ మార్కెట్లను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది. సోమవారం రాత్రి ఈ డీల్ ఖరారు కావడంతో, మంగళవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమవ్వడమే భారీ గ్యాప్-అప్‌తో మొదలై ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి.

ప్రారంభ ట్రేడింగ్‌లోనే సూచీలు సరికొత్త రికార్డుల దిశగా పరుగులు తీశాయి.NSE నిఫ్టీ ఏకంగా 1,083 పాయింట్లు (4.32%) లాభపడి 26,183 స్థాయి వద్ద ట్రేడ్ అయింది.BSE సెన్సెక్స్ 2,488 పాయింట్లు (3.05%) ఎగబాకి 84,154 వద్ద రికార్డు స్థాయిని తాకింది. చిన్న, మధ్యతరహా కంపెనీల సూచీలు కూడా ఏమాత్రం తగ్గకుండా 4 శాతం మేర లాభపడ్డాయి. గత కొద్దిరోజులుగా వాణిజ్య సుంకాలపై నెలకొన్న అనిశ్చితి ఈ ఒప్పందంతో తొలగిపోయింది.

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం..ముఖ్యంగా రత్నాలు-ఆభరణాలు, యంత్ర పరికరాలు మరియు ఐటీ రంగాలకు ఈ ఒప్పందం పెద్ద వరం కానుంది. అమెరికా విధిస్తామన్న టారిఫ్ భయం పోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు. పారిశ్రామిక దిగ్గజాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది.

నిజానికి ఈ ర్యాలీ సోమవారం నుండే మొదలైంది. ఫిబ్రవరి 2న సెన్సెక్స్ 943 పాయింట్లు, నిఫ్టీ 263 పాయింట్లు పెరిగి ముగిశాయి. అయితే, ట్రంప్ అధికారిక ప్రకటన వెలువడటంతో ఆ జోరు మంగళవారం రెట్టింపు అయింది. గిఫ్ట్ నిఫ్టీ ఇచ్చిన సంకేతాలకు అనుగుణంగానే మార్కెట్ భారీ లాభాల్లో పయనిస్తోంది. ఒక్క ఫోన్ కాల్.. ఒక ఒప్పందం.. భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించాయి. ఈ వాణిజ్య ఒప్పందం కేవలం రాజకీయ మైత్రి మాత్రమే కాదు, భారత మార్కెట్లకు ఒక బలమైన బూస్టర్ డోస్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News