Policy Documents: పాలసీదారులకి గమనిక.. ఇన్సూరెన్స్‌ బాండ్‌ పోయినట్లయితే ఏం చేయాలో తెలుసా..?

Policy Documents: జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇన్సూరెన్స్‌ తీసుకుంటారు.

Update: 2022-06-23 10:30 GMT

Policy Documents: పాలసీదారులకి గమనిక.. ఇన్సూరెన్స్‌ బాండ్‌ పోయినట్లయితే ఏం చేయాలో తెలుసా..?

Policy Documents: జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇన్సూరెన్స్‌ తీసుకుంటారు. ఇది పన్ను ఆదా చేయడానికి లేదా మెరుగైన రాబడి కోసం లేదా వైద్య ఖర్చులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ప్రజలు బీమా ద్వారానే చాలా పొదుపులు లేదా ప్రయోజనాలను పొందుతారు. అయితే బీమా పత్రాలు పోయినట్లయితే ఏంచేయాలో ఎవ్వరికి తెలియదు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

వాస్తవానికి ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు పాలసీదారుకు కొన్ని పత్రాలు అందజేస్తారు. ఈ పత్రాలను బాండ్లు అంటారు. మీరు పాలసీ చెల్లించరనడానికి ఇదే రుజువు. పాలసీకి సంబంధించిన మొత్తం సమాచారం వీటిలో ఉంటుంది. అయితే ఏదైనా కారణం వల్ల నిజమైన బాండ్లు పోయినట్లయితే పాలసీదారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మీరు అసలు పాలసీ బాండ్లని పోగొట్టుకున్న సందర్భంలో మీ బాండ్ పాలసీ కాపీని పొందే హక్కు మీకు ఉంటుంది. అయితే దీని కోసం మీరు కొన్ని పద్దుతులని అనుసరించాలి. ముందుగా బాండ్‌ పోయిందని మీ బీమా కంపెనీకి తెలియజేయాలి.

ఇది కాకుండా మీరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవాలి. మీరు బాండ్‌ కోల్పోయిన రాష్ట్రంలో పేపర్‌ ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు కంపెనీకి సంబంధించిన నష్టపరిహార పత్రాన్ని (నష్టపరిహార బాండ్) నింపాల్సి ఉంటుంది. పాలసీని మరెవరూ క్లెయిమ్ చేయలేని విధంగా నష్టపరిహారం బాండ్‌పై సంతకం చేయడం అవసరం. ఎవరైనా ఆ పాలసీకి యజమాని అని క్లెయిమ్ చేస్తే అప్పుడు అతనిపై తగిన చర్య తీసుకోవచ్చు.

Tags:    

Similar News