Bank Loan: మీ లోన్ రిజక్ట్ అవుతోందా.? మీరు చేసే ఈ తప్పులే కారణం
Bank Loan: ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ సరళీకృతంగా మారింది. రుణాలు చాలా సులభంగా అందిస్తున్నాయి.
Bank Loan: మీ లోన్ రిజక్ట్ అవుతోందా.? మీరు చేసే ఈ తప్పులే కారణం
Bank Loan: ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ సరళీకృతంగా మారింది. రుణాలు చాలా సులభంగా అందిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో లోన్ అప్లికేషన్స్ రిజక్ట్ అవుతుంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి.? అసలు లోన్ అప్లికేషన్ రిజక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రుణాలు పొందాలంటే క్రెడిట్ రిపోర్ట్ ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చాలా మంది క్రెడిట్ రిపోర్ట్‌ను పెద్దగా పట్టించుకోరు. మనిషికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో. ఆర్థికంగా ఆరోగ్యంగానే ఉన్నామన్న విషయాన్ని క్రెడిట్ రిపోర్టు తెలియజేస్తుంది. క్రెడిట్ రిపోర్టును పరిశీలించకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశముంది. చిన్న పొరపాట్లు రుణాల మంజూరును నిలిపివేసే ప్రమాదం ఉంది.
మంచి జీతం ఉంది నా రుణం ఎందుకు రిజక్ట్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే క్రెడిట్ రిపోర్టులో ఉండే చిన్న చిన్న సమస్యల కారణంగా లోన్ రిజక్ట్ అవుతుంది. అందుకే క్రెడిట్ స్కోర్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా లోన్ తీసుకొని తిరిగి చెల్లించడం మర్చిపోతే ఇబ్బందులు వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. లోన్ రీపెమెంట్ చేయడంలో విఫలమైతే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది.
క్రెడిట్ రిపోర్ట్‌లో మీ క్రెడిట్ చరిత్ర, క్రెడిట్ కార్డు వినియోగం, తీసుకున్న రుణాలు, తిరిగి చెల్లింపుల ట్రాక్ రికార్డ్ వంటి వివరాలను ఉంటాయి. క్రెడిట్ స్కోర్‌ను నిర్ణయించడానికి క్రెడిట్ రిపోర్టు కీలకం. నెలవారీ ఈఎమ్‌ఐ చిన్న మొత్తం అయినా సరే చెల్లించకపోతే రికార్డులో నెగటివ్ ఎంట్రీ అవుతుంది. మీకు సంబంధం లేకున్నా కొన్ని సందర్భాల్లో ఎవరో రుణాలు తీసుకున్నా మీకు తెలిసే అవకాశం ఉండదు. క్రెడిట్ కార్డులను పరిమితికి మించి వినియోగించడం వల్ల కూడా క్రెడిట్ స్కోర్ పడిపోతుంది.
క్రెడిట్ రిపోర్ట్‌ను మెరుగుపరుచుకునేందుకు.. కనీసం మూడు నెలలకు ఒకసారి క్రెడిట్ రిపోర్టును పరిశీలించుకోవాలి. రిపోర్టులో తప్పులుంటే సంబంధిత బ్యాంకును లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌ను సంప్రదించాలి. సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డు పూర్తి లిమిట్‌నే వాడాలి.