Business Idea: కాస్త స్థలం ఉన్నా సరే.. లక్షల్లో ఆదాయం పొందొచ్చు. బెస్ట్ బిజినెస్ ఐడియా
Business Idea: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయం ప్రధాన జీవనాధారం. కానీ, ఇటీవల కాలంలో వర్షాభావం, ఖర్చుల పెరుగుదల వంటి అనేక కారణాల వల్ల రైతుల ఆదాయం తగ్గుతోంది.
Business Idea: కాస్త స్థలం ఉన్నా సరే.. లక్షల్లో ఆదాయం పొందొచ్చు. బెస్ట్ బిజినెస్ ఐడియా
Business Idea: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయం ప్రధాన జీవనాధారం. కానీ, ఇటీవల కాలంలో వర్షాభావం, ఖర్చుల పెరుగుదల వంటి అనేక కారణాల వల్ల రైతుల ఆదాయం తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో సాంప్రదాయేతర వ్యవసాయ పద్ధతులు వాటిలో ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ తయారీ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
వర్మీ కంపోస్ట్ అంటే ఏమిటి?
వర్మీ కంపోస్ట్ అనేది వానపాముల సహాయంతో తయారయ్యే సహజ ఎరువు. ఇది భూమిలో సేంద్రీయ పదార్థాలను పగుళ్లుగా మార్చే ప్రక్రియ. ఈ ఎరువు పంటలకు ఎక్కువ పోషణను అందించి, భూఉత్పాదకతను పెంచుతుంది.
వర్మీ కంపోస్ట్ వల్ల లాభాలు:
అత్యల్ప పెట్టుబడితో ప్రారంభించవచ్చు, చిన్న స్థలంలో తయారు చేయవచ్చు,ఆర్గానిక్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. పంటల దిగుబడిలో పెరుగుదల, పర్యావరణానికి హానికరం ఉండదు. వర్మీ కంపోస్ట్ తయారీకి
ఓ సురక్షితమైన నీరు నిలిచిపోని స్థలం ఎంచుకోండి. ఇందుకోసం చిన్న చిన్న మడులు చేసి 2-3 అడుగుల లోతైన గోతులను తవ్వాలి.
తయారైన వర్మీ కంపోస్ట్‌ను ఎలా విక్రయించాలి?
మట్టిని ఎండబెట్టి వడబోసి, గులకరాళ్ళు తొలగించాలి. సన్నని పొడి లాగా తయారు చేసి కవర్లలో ప్యాక్ చేయాలి.
సేంద్రియ ఎరువుల దుకాణాలు, నర్సరీలు, ఆర్గానిక్ రైతులకు విక్రయించవచ్చు. ఒక సారి ప్రారంభించిన తర్వాత తక్కువ ఖర్చుతో పదే పదే తయారు చేసుకోవచ్చు. 50 కేజీ వర్మీ కంపోస్ట్‌ను రూ.400-600 వరకు విక్రయించవచ్చు.
గ్రామీణ మార్కెట్‌తో పాటు అర్బన్ ఆర్గానిక్ బజార్లలోనూ డిమాండ్ ఉంటుంది.