Union Bank: యూనియన్ బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్‌.. వడ్డీ రేట్లలో మార్పులు..!

Union Bank: మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయితే ఈ వార్త మీ కోసమే.

Update: 2022-05-10 09:30 GMT

Union Bank: యూనియన్ బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్‌.. వడ్డీ రేట్లలో మార్పులు..!

Union Bank: మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయితే ఈ వార్త మీ కోసమే. బ్యాంకు తన సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను మార్చాలని నిర్ణయించింది. పొదుపు వడ్డీ రేట్లను 2.90 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది. ఈ కొత్త వడ్డీ రేటు జూన్ 1, 2022 నుంచి వర్తిస్తుందని బ్యాంక్ తెలియజేసింది. ఇంతకుముందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు రూ. 50 లక్షల వరకు సేవింగ్స్ ఖాతాపై 2.90 శాతం వడ్డీ రేటును పొందేవారు. ఇప్పుడు దాన్ని 2.75 శాతానికి తగ్గించారు.

అదే సమయంలో రూ. 100 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు సేవింగ్స్ ఖాతాపై 3.10 శాతం వడ్డీ రేటును అందించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఇది మునుపటి కంటే ఎక్కువ. ఇంతకుముందు బ్యాంకు 100 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల పొదుపు ఖాతాలపై 2.9 శాతం వడ్డీ రేటును మాత్రమే చెల్లించేది. అలాగే రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి 3.55 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. అంతకుముందు ఇది 2.90 శాతంగా ఉండేది.

బ్యాంకులు ఎఫ్‌డిపై వడ్డీ రేటునుపెంచాయి. ఆర్‌బిఐ రెపో రేటును పెంచిన తర్వాత చాలా బ్యాంకులు తమ ఎఫ్‌డిల వడ్డీ రేట్లను మార్చాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ICICI బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, PNB మొదలైన బ్యాంకులు వడ్డీరేట్లలో మార్పులు చేశాయి. చాలా బ్యాంకులు వేర్వేరు కాలవ్యవధి వడ్డీ రేట్లను అందించాయి. 

Tags:    

Similar News