Business Idea: ఈ పువ్వుని పండించడం ద్వారా బంపర్ లాభాలు.. పెట్టుబడి కూడా తక్కువే..!

Business Idea: వ్యాపారం చేయాలంటే చాలామంది లక్షల రూపాయలు కావాలని ఆలోచిస్తారు. కానీ తక్కువ పెట్టుబడితో కూడా బిజినెస్‌ ప్రారంభించవచ్చు.

Update: 2022-05-24 11:00 GMT

Business Idea: ఈ పువ్వుని పండించడం ద్వారా బంపర్ లాభాలు.. పెట్టుబడి కూడా తక్కువే..!

Business Idea: వ్యాపారం చేయాలంటే చాలామంది లక్షల రూపాయలు కావాలని ఆలోచిస్తారు. కానీ తక్కువ పెట్టుబడితో కూడా బిజినెస్‌ ప్రారంభించవచ్చు. ఈ రోజు ట్యూబెరోస్ ఫ్లవర్స్ వ్యాపారం గురించి తెలుసుకుందాం. ట్యూబెరోస్ పువ్వులు చాలా కాలం పాటు తాజాగా, సువాసనగా ఉంటాయి. మార్కెట్‌లో వీటికి డిమాండ్‌ ఉండడానికి ఇదే కారణం. పుష్పగుచ్ఛాల నుంచి వివాహ వేడుకల వరకు మీరు ట్యూబెరోస్ పువ్వులని ఉపయోగిస్తారు. వీటికి విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. అదనంగా సుగంధ ద్రవ్యాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.

సాగుదారులు పెరుగుతారు

చాలామంది రైతులు సంప్రదాయ వ్యవసాయాన్ని విడిచిపెట్టి ట్యూబురోస్ పువ్వు పండిస్తున్నారు. భారతదేశంలో ఇది పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సాగవుతుంది. దేశంలో దాదాపు 20 వేల హెక్టార్లలో దీనిని సాగు చేస్తున్నారు. దేశంలోనే కాకుండా, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాల్లో కూడా ఈ పువ్వుని పండిస్తున్నారు. ఈ పువ్వు మొదటగా మెక్సికోలో పుట్టింది.

ట్యూబెరోస్ పువ్వుల పెంపకం కోసం మొదటగా పొలాన్ని సిద్ధం చేయాలి. ఎకరానికి 6-8 ట్రాలీ ఆవు పేడతో మంచి కంపోస్ట్‌ను చల్లాలి. అలాగే డీఏపీ వంటి ఎరువులను ఉపయోగించవచ్చు. ఈ పువ్వులు దుంపల ద్వారా వస్తాయి. ఒక ఎకరంలో దాదాపు 20 వేల దుంపలు వేయాలి. మీరు అవసరమనుకుంటే ప్రభుత్వ ఆర్థిక సాయం కూడా తీసుకోవచ్చు.ఈ పువ్వులని సమీపంలోని దేవాలయాలు, పూల దుకాణాలు, పెళ్లి గృహాలు మొదలైన వాటిలో సులభంగా విక్రయించవచ్చు. ఒక పువ్వు 5 నుంచి 6 రూపాయలకు అమ్ముడవుతోంది. అంటే ఎకరంలో పండే పూలతో రూ.1.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు సంపాదించే అవకాశాలు ఉంటాయి.

Tags:    

Similar News